స్టార్ నటి సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ గ్రాండియర్ మైథలాజికల్ మూవీ శాకుంతలం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పించిన ఈ మూవీని గుణా టీం వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణా గ్రాండ్ గా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీకి శేఖర్ వి జోసెఫ్ ఫోటోగ్రఫి అందించారు.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న విడుదలై యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ అటు యుఎస్ఎఏ లో పర్వాలేదనిపించే విధంగా సాగుతోంది. కాగా గడచిన నాలుగు రోజుల్లో మొత్తం 250కె డాలర్స్ గ్రాస్ ని యుఎస్ఏ లో శాకుంతలం మూవీ రాబట్టింది. అయితే ఇది అంత ఆశాజనకమైన ఫిగర్ కాదని, మరి ఈ మూవీ రాబోయే రోజుల్లో ఎంత మేర రాబడుతుందో చూడాలని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.