సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదన్న ఒకప్పటి స్టార్ హీరోయిన్

Published on Oct 31, 2020 3:00 am IST


ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది సమీరా రెడ్డి. దక్షిణాదిన పలువురు యువ, స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవితో ‘జై చిరంజీవ’, ఎన్ఠీఆర్ సరసన ‘నరసింహుడు, అశోక్’, సూర్యతో ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ సినిమాలు చేశారామె. కానీ పెళ్ళయ్యాక పూర్తిగా సినిమాలను దూరం పెట్టేసింది. పలు ఆఫర్లు వచ్చినా కాదన్నారు. అయితే తాజాగా ఆమె సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. తమిళంలో ఆర్య, విశాల్ కలిసి చేయనున్న కొత్త చిత్రంలో సమీరా రెడ్డి ఒక ముఖ్యమైన పాత్ర చేస్తుందనే ప్రచారం మొదలైంది.

ఈ వార్తలు చివరికి సమీరా రెడ్డి వరకు చేరాయి. దీంతో స్పందించిన ఆమె తనకు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని, అందరూ అంటున్నట్టు విశాల్, ఆర్యలు సినిమాల్లో తాను నటించడంలేదని, తన పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే కావడంతో వారికి తన అవసరం ఎంతో ఉందని, కాబట్టి సినిమాలకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. దీంతో రూమర్లకు కాస్త చెక్ పడింది. ఇకపోతే ‘అరిమ నంబి, ఇరుముగన్, నోటా’ సినిమాల దర్శకుడు ఆనంద్ శంకర్ విశాల్, ఆర్యల మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించనున్నారు. నిర్మాత వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More