యాభై శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ‘సమిధ`.

యాభై శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ‘సమిధ`.

Published on Jan 15, 2021 2:00 PM IST

మర్మం‌, ‘కనులు కలిసాయి`వంటి ఐదు షార్ట్ ఫిలిమ్స్ ని రూపొందించిన ద‌ర్శ‌కుడు సతీష్ మాలెంపాటి క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డ స్టార్ హీరో శ‌శికుమార్ త‌న‌యుడు అక్షిత్ శ‌శికుమార్ హీరోగా తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల‌లో రూపొందుతోన్న చిత్రం ‘సమిధ`. రాజ‌స్థాన్‌లో జ‌రిగిన య‌థార్ధ సంఘ‌ట‌న ఆధారంగా మూడు భాష‌ల్లో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌గా ` తెర‌కెక్కుతోన్న ఈ మూవీని అరుణం ఫిలింస్ సంస్థ‌ నిర్మిస్తోంది. `ఉండిపోరాదే` మూవీ ఫేమ్ అనువ‌ర్ణ‌, త‌మిళ న‌టి ఛాందిని హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే 50% చిత్రీక‌రణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నుండి సంక్రాంతి శుభాకాంక్ష‌ల‌తో కొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

అక్షిత్ శ‌శి కుమార్‌, అనువ‌ర్ణ‌, ఛాందిని, ర‌వివ‌ర్మ‌, పోసాని కృష్ణ ముర‌ళి, శ్రావ‌ణ్‌, ర‌వికాలే, బ్లాక్ పాండీ, కేపివై బాలా, శంక‌ర్ మూర్తి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి..సినిమాటోగ్ర‌ఫి: స‌తీష్ ముత్యాల‌, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎడిటింగ్‌: బి. నాగేశ్వ‌ర రెడ్డి‌, ఆర్ట్‌: ముర‌ళి, నిర్మాణం: అరుణం ఫిలింస్‌, క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ మాలెంపాటి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు