స్వయంభూ’లో వారియర్‌గా సంయుక్త.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

స్వయంభూ’లో వారియర్‌గా సంయుక్త.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

Published on Sep 11, 2024 6:03 PM IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను పూర్తి హిస్టారికల్ ఎపిక్ వార్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ఓ యోధుడిగా నిఖిల్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నాయని మేకర్స్ చెబుతున్నారు.

కాగా, నేడు యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ బర్త్ డే సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ‘స్వయంభూ’ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సంయుక్త కూడా ఓ యోధురాలి పాత్రలో నటిస్తుంది. అందంతో పాటు తన వీరత్వంతో ఆకట్టుకునే యోధురాలిగా సంయుక్త కనిపించనుంది. ఇక ఈ పోస్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘స్వయంభూ’ చిత్రాన్ని భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తుండగా భువన్, శ్రీకర్‌లు కలిసి పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. నభా నటేష్ మరో కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు