గ్రాండ్‌గా లాంచ్ అయిన సంయుక్తా మీనన్ కొత్త సినిమా!

అందాల భామ సంయుక్తా మీనన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ నటించేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

దర్శకుడు యోగేష్ కెఎంసి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పవర్‌ఫుల్ లేడీ యాక్షన్ థ్రిల్లర్‌గా రానుందని మేకర్స్ తెలిపారు. ఇక హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి హాజరై క్లాప్ కొట్టగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకులు వెంకీ కుడుముల, కోన వెంకట్, వశిష్ఠ, రామ్ అబ్బరాజు, సురేష్ బాబు, జెమినీ కిరణ్, సాహు గారపాటి, చుక్కపల్లి అవినాష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సినిమాను రాజేష్ దండా ప్రొడ్యూస్ చేస్తుండగా, సంయుక్తా మీనన్ తొలిసారి ఈ సినిమాను సమర్పిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version