‘సారంగపాణి జాతకం’ నుంచి ‘సంచారి’

‘సారంగపాణి జాతకం’ నుంచి ‘సంచారి’

Published on Dec 2, 2024 12:17 PM IST

ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తుందీ సినిమా. టైటిల్ సాంగ్ ‘సారంగో సారంగో…’ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. రెండో పాట ‘సంచారి… సంచారి…’ని ఈ రోజు విడుదల చేశారు. ‘సంచారి సంచారి… ఎటువైపో నీ దారి’ అంటూ సాగిన ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాశారు. వివేక్ సాగర్ స్వరపరిచిన అందమైన బాణీకి సంజిత్ హెగ్డే గాత్రం తోడు కావడంతో పాటలో విరహ వేదన అందంగా ఆవిష్కృతం అయ్యింది.

‘సంచారి సంచారి…’ పాట గురించి దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ… ”ఎటువంటి కథలోనైనా భావోద్వేగం లేకపోతే ఆ కథకు పరిపూర్ణత ఉండదు, ‘సారంగపాణి జాతకం’ లాంటి పూర్తి నిడివి హాస్యరస చిత్రంలో కూడా! ముఖ్యంగా ‘సారంగపాణి జాతకం’ సినిమాలో ప్రధానమైన అంశం ప్రేమ. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి, తన నమ్మకానికి మధ్య నలిగిపోయిన వ్యక్తి కథే ‘సారంగపాణి జాతకం’. ‘సంచారి’ అనే పాట తన నమ్మకం వల్ల తాను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని కోల్పోయే సందర్భంలో వస్తుంది. కొంత విరహ వేదన, కొంత ఆ అమ్మాయిని కోల్పోతాననే తపన – వేదన మేళవించిన గీతమిది. నాకు చాలా చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి. ఈ పాట ప్రేక్షకులకు కూడా దగ్గర అవుతుందని నమ్ముతున్నాను” అని అన్నారు.

ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ఇతర ప్రధాన తారాగణం.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు