‘A1 ఎక్స్‌ప్రెస్’ అవుట్‌పుట్‌ చూసుకున్నాక కళ్ళలో నీళ్లు తిరిగాయి – సందీప్ కిషన్

‘A1 ఎక్స్‌ప్రెస్’ అవుట్‌పుట్‌ చూసుకున్నాక కళ్ళలో నీళ్లు తిరిగాయి – సందీప్ కిషన్

Published on Mar 4, 2021 11:33 PM IST

యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం “A1 ఎక్స్ ప్రెస్”. ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ స్పోర్ట్స్ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 5న అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది.

ఈ సందర్బంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ
“ఇది నా ఇరవై ఐదవ చిత్రం. చాలా స్పెషల్. ఇలాంటి కథని నమ్మి సినిమా తీసిన మాతోటి నిర్మాతలకు కృతఙ్ఞతలు. వాళ్ళే నాకు దేవుళ్ళు. హాకీ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే మాసివ్ ఎంటర్టైనర్ ఇది. పేట్రియాటిజం వుండే హాకీ గేమ్ ని ఇండియన్స్ అందరూ బాగా చూస్తారు. అలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ మూవీ చేయడం నా అదృష్టం. అందరూ ఇది మా చివరి సినిమా అనుకొని చేశాం. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. అవుట్‌పుట్‌ చూసుకున్నాక టీమ్ అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మేమంతా శాటిస్ పై అయ్యాం. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని కాన్ఫిడెంట్ గా వున్నాం. ఈ చిత్రం ద్వారా నాకు వచ్చే లాభాల్లో పిల్లల చదువులకు వినియోగిస్తాను” అన్నారు.

చిత్ర దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను మాట్లాడుతూ “డే వన్ నుండి మా టీమ్ అంతా 200% పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసిన సినిమా ఇది. 14 మంది న్యూ టెక్నీషియన్స్ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. బిగ్ స్కేల్ లో తెరకెక్కిన న్యూ ఏజ్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ ఇది. ఇలాంటి మూవీ డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇచ్చిన మా నిర్మాతలకు, హీరో సందీప్ కిషన్ కు థాంక్స్. ఒక గేమ్ ఆడేటప్పుడు వాళ్లలో టాలెంట్ వున్న వారిని ఎంకరేజ్ చేయాలి అనే విష‌యాన్ని ఈ చిత్రంలో చూపించాం. అన్ని ఎమోషన్స్ వున్న చిత్రమిది. ప్రతిదీ ఆర్గానిక్ గా సెట్ అయ్యాయి. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ప్రేక్షకులకి కలుగుతుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా వున్నాయి” అన్నారు.

నిర్మాత దయా పన్నెం మాట్లాడుతూ.. “ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా చాలా ధియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. విజువల్ గా ఈ చిత్రం చాలా గ్రాండియర్ గా ఉంటుంది” అన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిబోట్ల మాట్లాడుతూ.. “కథపై నమ్మకంతో అందరం కలిసి ఒక మంచి ప్రయత్నం చేశాం. ఈ చిత్రాన్ని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ మాట్లాడుతూ.. “యంగ్ టాలెంటెడ్ టీమ్ అంతా కలిసి ది బెస్ట్ సినిమా చేశారు. రేపు ఎక్కువ స్క్రీన్స్ లలో రిలీజ్ చేస్తున్నాం. అందరూ చూసి ఎంజాయ్ చేయండి” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు