ఈ రెండు చిత్రాల కోసం నాలుగేళ్లు…క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా!


సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పరిచయం అవసరం లేని దర్శకుడు. తన తొలిచిత్రం తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయాడు సందీప్. గతేడాది అనిమల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు అందరి కళ్ళు ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించబోయే స్పిరిట్ పైనే ఉన్నాయి.

ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా చిత్రం గురించి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి కూడా ప్రస్తావించాడు సందీప్. సంచలన దర్శకుడు ఇటీవల కాలేజీ ఈవెంట్‌కు హాజరయ్యాడు, అక్కడ అతని భవిష్యత్తు ప్రణాళికల గురించి అడగగా, అందుకు సందీప్ రెస్పాండ్ అయ్యాడు. ఇప్పటికే తన తదుపరి రెండు చిత్రాలను ప్లాన్ చేసినట్లు తెలిపాడు. వాటిపై వచ్చే నాలుగేళ్లు స్పెండ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. తన తదుపరి ప్రాజెక్ట్, స్పిరిట్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి అని, ఈ చిత్రం మరో రెండేళ్లలో థియేటర్లలోకి వస్తుంది అని అన్నాడు. ఆ తర్వాత, రణబీర్ కపూర్‌తో కలిసి అనిమల్ పార్క్ కి సంబందించిన వర్క్ ప్రారంభిస్తా అని, ఈ రెండు సినిమాలకే తర్వాతి నాలుగేళ్లు చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version