ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన భారీ చిత్రం “తండేల్” కూడా ఒకటి. మరి సాలిడ్ ప్రమోషన్స్ ని మేకర్స్ చేస్తుండగా నేడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అయ్యితే చేస్తున్నారు. మరి ఈ ఈవెంట్ కి ఆల్రెడీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.
మరి లేటెస్ట్ గా మరో అప్డేట్ ని మేకర్స్ అందించారు. దీనితో పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా వస్తున్నట్టుగా ఇపుడు తెలిపారు. దీనితో ఈ ఈవెంట్ మరింత స్పెషల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆల్రెడీ అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి వంగ ఓ సినిమా అనౌన్స్ చేసి ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ లోపే ఈ ఇద్దరూ ఒకే స్టేజి మీద కనిపించేందుకు తండేల్ ఆస్కారం అయ్యింది. మరి వీరు ఎలాంటి విషయాలు పంచుకుంటారో చూడాలి.