‘స్పిరిట్’ మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్.. డ్యూటీ ఎక్కిన సందీప్ రెడ్డి!

‘స్పిరిట్’ మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్.. డ్యూటీ ఎక్కిన సందీప్ రెడ్డి!

Published on Oct 31, 2024 4:58 PM IST

టాలీవుడ్‌లో ది మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్టుల్లో ప్రభాస్ నటించబోయే ‘స్పిరిట్’ మూవీ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయనుండటంతో ఈ సినిమా ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే, ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తరువాత ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇప్పటివరకు రాలేదు. కానీ, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసినట్లు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ మేరకు వీడియోలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా కనిపించాడు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ‘స్పిరిట్’ మూవీపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు