పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇపుడు చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్ గా చూస్తున్న చిత్రం “స్పిరిట్” కూడా ఒకటి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించనున్న ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. ప్రభాస్ లాంటి సాలిడ్ కటౌట్ కి సందీప్ రెడ్డి వంగ లాంటి వైలెంట్ దర్శకుడు యాడ్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమాకి చూడబోతున్నాం.
ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తుండగా ఇపుడు ఫైనల్ గా ఈ సినిమా షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ లీక్ ని సందీప్ అందించించడం వైరల్ గా మారింది. ప్రస్తుతం తాను లొకేషన్స్ రెక్కీలో ఉన్నట్టుగా తెలిపారు. అలాగే షూటింగ్ ని తాను మెక్సికోలో మొదలు పెట్టనున్నట్టుగా లీక్ చేశారు. ప్రస్తుతానికి అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి అప్డేట్ ఇదే అని తెలిపారు. దీనితో మొత్తానికి స్పిరిట్ పై ఒక క్లారిటీ అయితే ఫ్యాన్స్ కి వచ్చింది అని చెప్పవచ్చు.