‘స్పిరిట్’ కోసం సందీప్ రెడ్డి వంగా భారీ ప్లాన్..?

‘స్పిరిట్’ కోసం సందీప్ రెడ్డి వంగా భారీ ప్లాన్..?

Published on Oct 17, 2024 3:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్, ఈ సినిమాను ముగించుకుని తన నెక్స్ట్ మూవీ ‘ఫౌజీ’లో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే టైటిల్‌ను ఇప్పటికే ఫిక్స్ చేశారు.

అయితే, ‘స్పిరిట్’ కోసం సందీప్ రెడ్డి వంగా ఓ పవర్‌ఫుల్ కథను రాసుకున్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించబోతున్నాడని తెలుస్తోంది. అందులో ఒకటి పోలీస్ పాత్ర అని చిత్ర వర్గాల్లో టాక్. ఇక ఈ సినిమాలో యాక్షన్ డోస్ రెట్టింపుగా ఉండబోతుందట. కాగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రణ్‌బీర్ కపూర్‌ల కేమియో కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాను చేసిన సినిమాల హీరోలను ‘స్పిరిట్’లోనూ చూపెట్టాలని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నాడట.

అంతేగాక, ‘స్పిరిట్’లో ఓ స్టార్ హీరోను విలన్ పాత్రలో నటింపజేసేందుకు సందీప్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడట. ఇలా ‘స్పిరిట్’ సినిమాలో పలువురు స్టార్స్‌ను చూపెడుతుండటంతో, సందీప్ రెడ్డి ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడనే టాక్ సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు