తన సినిమాలను తానే నిర్మించుకుంటానంటున్న సందీప్ వంగ

Published on Oct 21, 2020 1:12 am IST


‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ వంగ. ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ బ్లాక్ బస్టర్ అందుకుని అక్కడ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఆతర్వాత తన రెండో సినిమాను తెలుగులో చేయాలని చూసినా చివరికి హిందీ పరిశ్రమకే ఫిక్స్ అయ్యారు. అక్కడే ఒక స్టార్ హీరోతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. ఇది ఒక క్రైమ్ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ వంగ తన తర్వాత సినిమాలన్నింటినీ తానే స్వయంగా నిర్మించుకోవాలని అనుకుంటున్నానని, వేరొకరు తన సినిమాకు డబ్బు పెడితే తనకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండదని అందుకే తానే నిర్మించుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ‘కబీర్ సింగ్’ హిట్ తర్వాత సందీప్ వంగ సినిమాల మీద ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయినా సందీప్ క్రియేటివ్ ఫ్రీడమ్ కోసం తానే నిర్మాతగా ఉండాలని డిసైడ్ అవడం డేరింగ్ డెసిషన్ అనే అనాలి.

సంబంధిత సమాచారం :

More