ఐకాన్ స్టార్ తో కూడా అలాగే ప్లాన్ చేస్తున్న వంగ?

ఐకాన్ స్టార్ తో కూడా అలాగే ప్లాన్ చేస్తున్న వంగ?

Published on Dec 20, 2023 9:08 PM IST


పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు తన అవైటెడ్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2” లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ దర్శకుడు సుకుమార్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నుంచి మరింత క్రేజీ లైనప్ అయితే సిద్ధం కాబోతుంది. ఇక ఈ లైనప్ లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో అనౌన్స్ చేసిన చిత్రం కూడా ఒకటి.

అయితే ఇది మేకర్స్ సింపుల్ గానే అనౌన్స్ చేశారు తప్పితే ఇక వేరే అప్డేట్స్ ఏవి దీనిపై లేవు. కానీ రీసెంట్ గా నిర్మాణ సంస్థ టి సిరీస్ వారు సందీప్ తో తాము సినిమాల్లో వరుసగా అల్లు అర్జున్ తో సినిమాని కూడా మెన్షన్ చేశారు. అయితే ఇందులో అల్లు అర్జున్ తో ఓ సాగా అంటూ తెలిపారు. అంటే దీనిని కూడా ‘అనిమల్’ తరహాలో భాగాలుగా చేస్తున్నారా అనేది ఆసక్తిగా మారింది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు