ఓటీటీలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెన్సేషన్.. ఏమాత్రం తగ్గడం లేదుగా!

ఓటీటీలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెన్సేషన్.. ఏమాత్రం తగ్గడం లేదుగా!

Published on Mar 24, 2025 10:22 PM IST

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో వెంకీ, అనిల్ కాంబినేషన్‌లో హ్యా్ట్రిక్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు భీమ్స్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా నిలిచింది. థియేటర్లలో దుమ్ములేపిన ఈ చిత్రం ఓటీటీలోనూ తన జోరు చూపిస్తోంది.

మార్చి 1 నుంచి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమా ఏకంగా 400 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఇంకా ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారని వారు చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు