బుక్ మై షోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్‌టైమ్ రికార్డు

బుక్ మై షోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్‌టైమ్ రికార్డు

Published on Jan 30, 2025 10:00 PM IST

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ వైపు పరుగులు పెడుతోంది.

అయితే, ఈ సినిమా ప్రముఖ ఆన్‌టైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ఏకంగా 3.3 మిలియన్ టికెట్ బుకింగ్స్ జరిగినట్లు బుక్ మై షో వెల్లడించింది. ఓ తెలుగు చిత్రానికి ఈ రేంజ్‌లో టికెట్ బుకింగ్స్ జరగడం రికార్డ్ అని చెప్పాలి. పాన్ ఇండియా కాకుండా కేవలం తెలుగులో మాత్రమే ఈ సినిమా ఈ ఫీట్‌ను అందుకోవడం నిజంగా విశేషం.

ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు