బుక్ మై షోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రేజ్

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రానుంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది.

అయితే, ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కోసం ఫ్యామిలీ ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాకు ఆదరణ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఎంగేజింగ్‌గా ఉండటం.. పండుగ చిత్రాల్లో ఈ మూవీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందని ప్రేక్షకులు భావిస్తుండటంతో, ఈ సినిమాను చూసేందుకు వారు సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఏకంగా 201K ఇంట్రెస్ట్‌లతో దూసుకుపోతుంది. మిగతా సినిమాలకు పోటీగా ఈ చిత్రం కూడా వస్తుండటంతో ఈ పండుగ సీజన్ మరింత రసవత్తరంగా మారింది. ఇక ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version