స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి థియేటర్స్‌లో సందడి చేస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. పండుగకు పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ మూవీగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సాలిడ్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది.
ఇక తొలిరోజు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రాగా, రెండో రోజు కూడా అదే తరహా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డు పడుతోంది. ఏపీలో మొత్తం 238 షోలకు గాను 233 షోలు ఫుల్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో థియేటర్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఈవినింగ్ షోలతో పాటు నైట్ షోలు కూడా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌ను అందుకుంటున్నాయి.
అటు నైజాం ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నైజాంలో మొత్తం 368 షోలకు గాను 366 షోలతో సోల్డ్ అవుట్ బోర్డు కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాకు రెండో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే కలెక్షన్స్ రానున్నాయని స్పష్టమవుతోంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వెంకీ తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక భీమ్స్ అందించిన పాటలు ఇప్పటికే బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌ను తెచ్చుకున్నాయి. ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రొడ్యూస్ చేశారు.