విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాలో వెంకీ వింటేజ్ కామెడీ మార్క్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.
అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా డిజిటల్ డీల్ ముగిసినట్లుగా తెలుస్తోంది. గతంలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. కానీ, ఇప్పుడు ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను జీ స్టూడియోస్ దక్కించుకుంది. అటు శాటిలైట్ రైట్స్‌ను కూడా ఇదే సంస్థ దక్కించుకుంది. భారీ రేటుతో ఈ చిత్ర డిజిటల్ డీల్ ముగిసినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది.