టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ మూవీ ముచ్చటగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.
ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల మేర వసూళ్లు రాబట్టడంతో పాటు రిలీజ్ అయిన అన్ని చోట్ల లాభాలను తెచ్చిపెట్టినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాతో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ మంచి ప్రాఫిట్స్ అందుకున్నారు. వారితో పాటు ఈ సినిమా డిస్ట్రిబ్యూటీర్స్ కూడా భారీ లాభాలను అందుకున్నారు. దీంతో ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర యూనిట్‌కు తమ కృతజ్ఞతలు తెలిపేందుకు డిస్ట్రిబ్యూటర్ల మీట్ ఏర్పాటు చేస్తున్నారు.
రేపు (ఫిబ్రవరి 1న) మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ డిస్ట్రిబ్యూటర్స్ మీట్ ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ మీట్‌కు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.