మాస్ సాంగ్ షూట్ లో “సంక్రాంతికి వస్తున్నాం”..

ఈ సంక్రాంతి కానుకగా మన టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడి అలాగే విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వస్తున్నా చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఉంది. మరి మంచి బజ్ ని తెచ్చుకున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా నటించారు. మరి ఈ సినిమా టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసుకొని ఓ పక్క ప్రమోషన్స్ చేస్తూనే బాలన్స్ షూట్ ని కూడా కంప్లీట్ చేసేస్తున్నారు.

ఇలా ప్రస్తుతం ఒక మాస్ సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నట్టుగా మేకర్స్ తెలిపారు. మరి ఈ షూట్ ని రామోజీ ఫిలిం సిటీలో ఫుల్ స్వింగ్ లో తెరకెక్కిస్తుండగా ఈ సాంగ్ థియేటర్స్ లో ఫీస్ట్ ఇస్తుంది అని మేకర్స్ అంటున్నారు. మరి అల్రెడీటీ భీమ్స్ ఇచ్చిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మరి ఈ మాస్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా ఈ జనవరి 14న సినిమా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version