విడుదల తేదీ : జనవరి 14, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు :వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, శ్రీనివాస్ అవసరాల, నరేష్, ఉపేంద్ర లిమాయె, మాస్టర్ రేవంత్, సాయి కుమార్
దర్శకుడు : అనీల్ రావిపూడి
నిర్మాతలు :దిల్ రాజు, శిరీష్
సంగీతం :భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం :సమీర్ రెడ్డి
కూర్పు : తమ్మిరాజు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన పండుగ సినిమా “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఇక కథ లోకి వస్తే.. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో నిజాయితీగా పని చేసే యాదగిరి రాజు (వెంకటేష్) తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం(ఐశ్వర్య రాజేష్) ని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబం తోనే సెటిల్ అయ్యిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకాన్ సత్య ఆకెళ్ల(శ్రీనివాస్ అవసరాల) ఎలా కిడ్నాప్ అయ్యాడు? తనని కిడ్నాప్ చేసిన మిషన్ లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి(మీనాక్షి చౌదరి) అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియలి అంటే ఈ సినిమాని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఆద్యంతం వినోదభరితంగా సాగే కథనం అని చెప్పాలి. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథనం హిళేరియాస్ గా కొనసాగుతుంది అని చెప్పాలి. మెయిన్ గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్ గా వర్కవుట్ అయ్యాయి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కవుట్ అయ్యింది.
ఇలా సినిమాలో చాలా ఎపిసోడ్స్ జెనరల్ ఆడియెన్స్ ని సైతం మెప్పించేలా నీట్ గా వెళ్లిపోతాయి. ఇక అనీల్ రావిపూడి సినిమాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ రేంజ్ లోనే ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మాంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా వెంకీ మామ తన రోల్ లో అదరగొట్టారని చెప్పాలి. తన నుంచి ఈ కొంత కాలం మిస్ అయ్యిన కామెడీ మళ్లీ కనిపించింది.
అలాగే తనతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదరగొట్టేసాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతీ ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్ గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్ గా మీనాక్షి షైన్ అయ్యింది.
అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్ లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్ లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్ కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది.
మైనస్ పాయింట్స్:
అనీల్ రావిపూడి పటాస్ సినిమా మినహా ఇపుడు సంక్రాంతికి వస్తున్నాం వరకు తన లైన్స్ అన్నీ ఒకింత రొటీన్ గానే ఉన్నాయని చెప్పాలి. అలానే సంక్రాంతికి వస్తున్నాం లో కూడా రొటీన్ లైన్ నే సాగదీస్తూ వెళ్లిపోయారు. దీనితో ఇందులో కూడా అంత కొత్తదనం కనిపించదు. అలాగే ఫస్టాఫ్ లో నడిచిన ఎంటర్టైనింగ్ మూమెంట్స్ కొంచెం సెకండాఫ్ లో తగ్గినట్టు అనిపిస్తుంది.
క్లైమాక్స్ లో కూడా తన మార్క్ కామెడీ సీన్స్ ని ఏమన్నా యాడ్ చేసి ఉంటే డోస్ సరిపోయేది. అలాగే లాజిక్స్ కూడా తన సినిమాల్లో పట్టించుకోకూడదు అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి సో వాటిని కూడా పక్కన పెట్టేస్తే తప్ప ఇది అన్ని వర్గాల ఆడియెన్స్ కి నచ్చకపోవచ్చు. అలాగే సెకండాఫ్ లో భీమ్స్ యాక్షన్ ఎపిసోడ్స్ లో స్కోర్ ని విజయ్ లియో సినిమా లియో దాస్ థీమ్ నుంచి కాపీ కొట్టినట్టు క్లియర్ గా అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం:
అనీల్ రావిపూడి, దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సినిమాల కంటే ఈ సినిమాలో నిర్మాణ విలువలు చాలా బెటర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ లో భీమ్స్ ఇచ్చిన సాంగ్స్ విజువల్ గా కూడా హిట్ అయ్యాయి. స్కోర్ కూడా చాలా సీన్స్ లో బాగుంది. సినిమాటోగ్రఫీ మంచి కలర్ ఫుల్ గా బాగుంది, ఎడిటింగ్ వర్క్స్ బాగానే ఉన్నాయి.
ఇక దర్శకుడు అనీల్ రావిపూడి విషయానికి వస్తే.. తనలోని గొప్ప విషయం ఏమిటంటే ప్రతీ సినిమాకి కొంచెం రెగ్యులర్ లైన్ నే ఎంచుకున్నప్పటికీ దానిని నడిపించే విధానం మాత్రం స్యూర్ షాట్ అన్నట్టు ఉంటుంది. అది ఎలాంటి హీరో విషయంలో అయినా సమానంగా కనిపిస్తుంది. సరిగ్గా ఇదే మళ్లీ రిపీట్ అయ్యింది అని చెప్పవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం లో కూడా సాలిడ్ హిళేరియాస్ నరేషన్ తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్లీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్ గా అయితే అనీల్ మళ్లీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “సంక్రాంతికి వస్తున్నాం” సంక్రాంతికి వచ్చి ఆడియెన్స్ కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మెయిన్ గా అనీల్ రావిపూడికి తెలిసిన ఫ్యామిలీ ఆడియెన్స్ పల్స్ మళ్లీ వర్కవుట్ అయ్యింది. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిళేరియాస్ గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ధారాళంగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడొచ్చు.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team