విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”. ఈ కొత్త ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకి పైగా గ్రాస్ అందుకొని దుమ్ము లేపింది. అయితే ఈ సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఓటిటి డేట్ అనేది రాలేదు కానీ దీని కంటే ముందే టీవీ ప్రసారం డేట్ వచ్చేసింది.
మరి ఈ సినిమా హక్కులు జీ5 వారు సొంతం చేసుకోగా ఆల్రెడీ అఫీషియల్ టెలికాస్ట్ డేట్ మార్చ్ 1 వచ్చేసింది. అయితే అదే రోజు స్ట్రీమింగ్ కూడా ఉంటుంది అని స్ట్రాంగ్ బజ్ రాగ ఇపుడు ఫైనల్ గా అదే అఫీషియల్ అయ్యింది. టీవిలో టెలికాస్ట్ సమయం సాయంత్రం 6 గంటల నుంచే జీ5 లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి తెస్తున్నట్టు ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకుంటుందో చూడాలి.