నార్త్ అమెరికాలో “సంక్రాంతికి వస్తున్నాం” ర్యాంపేజ్!

నార్త్ అమెరికాలో “సంక్రాంతికి వస్తున్నాం” ర్యాంపేజ్!

Published on Jan 29, 2025 11:50 AM IST

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా సక్సెస్ ఫుల్ దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన బిగ్గెస్ట్ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కోసం అందరికీ తెలిసిందే. తెలుగు ఆడియెన్స్ ఓ రేంజ్ లో బ్రహ్మరథం పట్టిన ఈ సెన్సేషనల్ హిట్ చిత్రం వెంకీ మామ కెరీర్లోనే కాకుండా రీజనల్ గా భారీ వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచింది.

ఇక మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా “సంక్రాంతికి వస్తున్నాం” ర్యాంపేజ్ చూపిస్తుంది. అక్కడ కూడా భారీ వసూళ్లు అందుకొని దూసుకెళ్తుండగా ఒక్క నార్త్ అమెరికా నుంచే ఇపుడు సినిమా 2.8 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని క్రాస్ చేసి దుమ్ము లేపింది. అయితే నెక్స్ట్ మార్క్ గా 3 మిలియన్ క్లబ్ లో చేరేందుకు మరిన్ని అవకాశాలు ఈ చిత్రానికి తప్పకుండా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు, శిరీష్ లు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు