బుక్ మై షోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రేజ్ చూశారా!

బుక్ మై షోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రేజ్ చూశారా!

Published on Jan 15, 2025 11:02 PM IST

టాలీవుడ్‌లో ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ సందడి చేస్తోంది.

అయితే, ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా థియేటర్లకు వెళ్తుండటంతో ఈ మూవీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఈ సినిమా ఏకంగా 1.05 మిలియన్‌కు పైగా టికెట్లు బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్థాయిలో ఒక సినిమా టికెట్ బుకింగ్స్ జరగడం నిజంగా విశేషమని చెప్పాలి.

ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు