బుల్లితెరపై టీఆర్పీ రేటింగ్‌తో దుమ్ములేపిన ‘సంక్రాంతికి వస్తున్నాం’

బుల్లితెరపై టీఆర్పీ రేటింగ్‌తో దుమ్ములేపిన ‘సంక్రాంతికి వస్తున్నాం’

Published on Mar 13, 2025 3:04 PM IST

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాక ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కడంతో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కళ్లు చెదిరే వసూళ్లతో ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ఇక ఇటీవల ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్, టెలివిజన్ ప్రీమియర్‌లో కూడా వచ్చేసింది. జీ తెలుగు ఛానెల్‌లో మార్చి 1న ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ అయ్యింది. అయితే, ఈ సినిమాకు టెలివిజన్ ప్రీమియర్‌లో ఏకంగా 18.1 టీవీఆర్(టెలివిజన్ వ్యూయర్ రేటింగ్) దక్కినట్లు తెలుస్తోంది. SD ఛానెల్‌+HD ఛానెల్‌లో కలిపి ఈ రేటింగ్ దక్కినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. గత రెండేళ్లలో ఈ చిత్రం హయ్యెస్ట్ టీవీఆర్ సాధించిందని చిత్ర యూనిట్ తెలిపింది. అదే రోజున ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు కూడా రావడం విశేషం. అయినా కూడా టీవీలో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు.

గత ఐదేళ్లలో జీ తెలుగులో టెలికాస్ట్ అయిన చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీ టాప్ ప్లేస్‌లో ఉండగా.. సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు రెండో ప్లేస్‌కు చేరుకుంది. ఇలా థియేటర్స్, ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం.. ఇప్పుడు బుల్లితెరపై కూడా రికార్డులను సృష్టించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు