టాలీవుడ్‌లో 2025 సంక్రాంతి విన్నర్‌గా నిలిచి బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
అయితే, ఈ సినిమాను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. కానీ, వారి గమనిస్తే, ఈ సినిమా రన్‌టైమ్‌లో కోత పడింది. థియేట్రికల్ రిలీజ్‌లో ఈ చిత్ర రన్‌టైమ్ 2 గంటల 24 నిమిషాలుగా ఉంది. అయితే, ఓటీటీలో ఈ మూవీ రన్‌టైమ్ 2 గంటల 16 నిమిషాలు ఉంది. దీంతో ఈ సినిమాలోని 8 నిమిషాలు కట్ చేశారు మేకర్స్.
సాధారణంగా సినిమా సక్సెస్ అయితే, ఓటీటీలో అధిక రన్‌టైమ్‌ను యాడ్ చేసి మరీ ప్రదర్శిస్తారు. కానీ, ఇంతటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ నుంచి 8 నిమిషాలు ఎందుకు డిలీట్ చేశారనేది తెలియాల్సి ఉంది.