ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యిన చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఒకటి. అయితే ఈ చిత్రంతో ప్రస్తుతం మారిపోయిన ట్రెండ్ కి భిన్నంగా ఓటిటి కంటే ముందే టీవిలో టెలికాస్ట్ కి ఈ చిత్రాన్ని వరల్డ్ ప్రీమియర్ గా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రంని జీతెలుగు ఛానెల్ వారు ప్రసారానికి తీసుకురానున్న సంగతి తెలిసిందే. మరి థియేటర్స్ లో రిలీజ్ కి ముందు అనీల్ ఎలాంటి ప్రమోషన్స్ ని చేసి సినిమాపై హైప్ ని తెచ్చుకున్నారో తెలిసిందే. ఇక ఇపుడు టెలివిజన్ ప్రీమియర్ కి కూడా ఇదే జోరులో ప్రమోషన్స్ చేస్తుండడం విశేషం. ఇలా లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రోమోలు కూడా వెంకీ మామ, అనీల్ నుంచి వస్తున్నాయి. మరి ఇవి కూడా వర్కౌట్ అయ్యి స్మాల్ స్క్రీన్ పై రికార్డు టీఆర్పీ ని సొంతం చేసుకుంటారా అనేది చూడాలి. ఇక ఈ అవైటెడ్ సినిమా రేపు మార్చ్ 1 సాయంత్రం 6 గంటలకి జీతెలుగులో ప్రసారం కాబోతుంది.
A perfect mix of fun, drama & emotions ????
Watch #SankranthikiVasthunnam This Saturday 6PM, Only On #ZeeTelugu ✨#SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam #FirstTVloVasthunnam #SVonTV #SankranthikiVasthunnamFirstOnTV #ZeeTeluguSpotlight… pic.twitter.com/zQ7X7Oh6qz
— ZEE TELUGU (@ZeeTVTelugu) February 27, 2025