‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్.. వెంకీ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం!

‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్.. వెంకీ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం!

Published on Jan 6, 2025 8:12 PM IST

ఈ సంక్రాంతి కానుకగా రాబోతున్న సినిమాల్లో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులు ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా డిజిటల్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్యూర్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఆకట్టుకునే యాక్షన్‌తో నింపేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్‌ను చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి ఫ్యామిలీ కంటెంట్‌లో చూడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ట్రైలర్‌లో వెంకటేష్ తనదైన మార్క్ వన్ లైనర్ పంచులతో ఇరగదీశాడు. ఇక వెంకీ మరోసారి కామెడీ టైమింగ్‌తో నవ్వించేందుకు సిద్ధమయ్యాడు.

హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరికి కూడా సాలిడ్ పాత్రలు పడినట్లుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు ఇప్పటికే ట్రెమెండస్ రెస్పాన్స్‌ను అందుకున్నాయి. ఈ సినిమాలో బీజీఎం కూడా సూపర్‌గా ఉండబోతుందని ఈ ట్రైలర్‌లో తెలుస్తోంది. మొత్తానికి అనిల్ రావిపూడి తనకు ఎంతో కలిసొచ్చే కమర్షియల్ అంశాలను ఏమాత్రం మిస్ కాకుండా ఈ సినిమాలో ఉండేలా చూసినట్లు కనిపిస్తుంది. ఇక ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తాన్ని ఆకట్టుకునే సినిమాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిలవనుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు