యూఎస్‌లో వెంకీ మామ దూకుడు..!

యూఎస్‌లో వెంకీ మామ దూకుడు..!

Published on Jan 16, 2025 2:01 AM IST

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని షోలు కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. అయితే, ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది.

ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా వసూళ్లు చూస్తుంటే ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్‌తో వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ఇప్పటివరకు నార్త్ అమెరికా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 800K డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్‌లోకి సాలిడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. దీంతో పాటు ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఈ మూవీ ఎలాంటి బిగ్ ఫిగర్స్ నమోదు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు