పక్కా ప్లానింగ్ తో “సంక్రాంతికి వస్తున్నాం”.. షెడ్యూల్ ఇదే

ఈ సంక్రాంతి కానుకగా మన తెలుగు సినిమా దగ్గర రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడి అలాగే విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కూడా ఒకటి. మరి ఆల్రెడీ వీరి నుంచి ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు హిట్స్ గా ఉండగా వాటి తర్వాత వస్తున్న సినిమా కావడం ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు కూడా హిట్ అవ్వడం అనేది మంచి హైలైట్ గా మారింది.

దీనితో సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమాకి ఇప్పుడు నుంచే మంచి బజ్ నెలకొనగా రిలీజ్ లోపు మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ తో ప్యాకెడ్ గా రాబోతున్నారని చెప్పాలి. లేటెస్ట్ గా తమ ప్రమోషన్స్ తాలూకా షెడ్యూల్ ని కూడా రివీల్ చేశారు. మరి వీటిలో మీను సాంగ్ నుంచి ప్రమోషనల్ ఇంటర్వ్యూలు, సంక్రాంతి సాంగ్, టీవీ, టాక్ షోస్ లో కూడా టీం ప్రెజెన్స్ ఇక ఫైనల్ గా ట్రైలర్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ లని తీసుకొస్తున్నట్టుగా షెడ్యూల్ రివీల్ చేశారు. దీనితో పక్కా ప్లానింగ్ తో మేకర్స్ సంక్రాంతి వస్తున్నారని చెప్పాలి.

Exit mobile version