గ్రాండ్ గా సంతోషం OTT అవార్డ్స్ వేడుక – అల్లు అరవింద్, శ్రీలీల చేతుల మీదుగా సంతోషం 2022 సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ కర్టెన్ రైజర్

గ్రాండ్ గా సంతోషం OTT అవార్డ్స్ వేడుక – అల్లు అరవింద్, శ్రీలీల చేతుల మీదుగా సంతోషం 2022 సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ కర్టెన్ రైజర్

Published on Dec 22, 2022 9:00 PM IST


దాదాపుగా 20 ఏళ్లకు పైగా టాలీవుడ్ మూవీస్ కి సంతోషం అవార్డులని అందిస్తూ అటు జర్నలిస్ట్ గా అలానే నిర్మాతగా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు సంతోషం సురేష్. ఇక లేటెస్ట్ గా ఆయన సరికొత్త అవార్డులకు శ్రీకారం చుట్టారు. 2021, అలానే 2022 సంవత్సరాల్లో విడుదలైన ఓటిటి అవార్డ్స్ ఫస్ట్ ఎడిషన్ ని ఆయన ఆరంభించారు. కాగా 2022 సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక కర్టెన్ రైజర్తాజాగా ఎంతో వైభవంగా జరుగగా పలువురు అతిథులు ప్రత్యేకంగా విచ్చేసి గ్రహీతలకు అవార్డులు అందజేశారు.

అవార్డులు అందుకున్న వారి వివరాలు – 2021

బెస్ట్ వెబ్ సీరీస్ పరం పర – నిర్మాత శోభు యార్లగడ్డ
బెస్ట్ యాక్టర్ – రాజేంద్ర ప్రసాద్ (సేనాపతి)
బెస్ట్ డైరెక్టర్ – సినిమా బండి (ప్రవీణ్ కండ్రేగుల)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – మహేష్ ఉప్పల (ఒక చిన్న ఫ్యామిలీ కథ సీరీస్)

అవార్డులు అందుకున్న వారి వివరాలు – 2022

బెస్ట్ విలన్ – సమ్మెట గాంధీ – (రెక్కీ సిరీస్)
బెస్ట్ వెబ్ సీరీస్ – గాలివాన – (నిర్మాత శరత్ మరార్)
బెస్ట్ యాక్టర్ – రాజ్ తరుణ్ (అహ నా పెళ్ళంట వెబ్ సీరీస్)
బెస్ట్ డైరెక్టర్ – శరణ్ కొప్పిశెట్టి (గాలివాన వెబ్ సీరీస్)
బెస్ట్ ప్రొడ్యూసర్ – రాహుల్ తమడ, సాయి దీప్ (అహా నా పెళ్ళంట)
బెస్ట్ సపోర్టింగ్ మేల్ – సాయి కుమార్ (గాలి వాన వెబ్ సీరీస్)
బెస్ట్ సపోర్టింగ్ ఫిమేల్ – చాందిన చౌదరి (గాలి వాన వెబ్ సీరీస్)
బెస్ట్ పర్ఫార్మర్ ఫిమేల్ – రాధిక శరత్ కుమార్ (గాలి వాన వెబ్ సీరీస్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – శక్తి కాంత్ (09 హవర్స్ సీరీస్)
బెస్ట్ ఎడిటర్ – సంతోష్ కామిరెడ్డి (గాలివాన వెబ్ సీరీస్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ – మనోజ్ రెడ్డి (గాలివాన వెబ్ సీరీస్)

ఇక అవార్డుల వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, సంతోషం సురేష్ ఇటువంటి గొప్ప విషయాల్లో అందరికంటే ముందుంటారని అన్నారు. అందుకే ఈ అవార్డుల వేడుక కోసమే తాను విశాఖపట్నం నుండి వచ్చానని, వెండితెరపై ప్రదర్శితం అయ్యే సినిమాలకి సమానంగా ఈ విధంగా ఓటిటి అవార్డులని ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆయన ఆలోచన ఎంతో బాగుందని, ఆయనని మనస్ఫూర్తిగా అభినందిస్తుననట్లు తెలిపారు అరవింద్.

హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ, ఈ విధంగా ఓటిటి సిరీస్ లకు కూడా అవార్డులు అందించడం ఎంతో చక్కని పరిణామం అని, ఈ విధమైన మంచి ఆలోచన చేసిన సురేష్ గారికి అభినందనలు తెలిపిన శ్రీలీల, ఆయనతోనే తన ఫస్ట్ ఇంటర్వ్యూ జరిగిందని తెలిపారు. తప్పకుండా ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్నానని అన్నారు.

స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కథకుడిగా తన కథలకు అందరి నుండి మంచి సపోర్ట్ వస్తుందని, అయితే ఓటిటి లో వారికి అవార్డులు వస్తే అది నిజంగా ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు. ఓటిటి లోనే రచయితలకు నిజమైన స్థానం దొరుకుతుందని, కొందరు రాస్తున్న కథలు చూస్తుంటే షివరింగ్ వస్తుందని అన్నారు. ఇంత గొప్ప సంతోషం సురేష్ గారికి రియల్ థాంక్స్ అని అన్నారు.

యాక్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ, ఫస్ట్ టైం ఓటిటి ప్లాట్ ఫామ్ లో చేసిన గాలి వాన లో నా రోల్ కు సపోర్టింగ్ యాక్టర్ అవార్డు రావడం, అది కూడా నాన్న గారికి ఎంతో ఇష్టమైన రాఘవేంద్రరావు గారి చేతులమీదుగా అందుకోవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది.

మురళి మోహన్ మాట్లాడుతూ, దాదాపుగా 25 ఏళ్లుగా సంతోషం పత్రికా ఇంకా విజయవంతంగా నడుపుతున్నారు సురేష్. నిజానికి మధ్యలో అనేక పెద్ద మ్యాగజైన్స్ వారు చేతులెత్తేస్తే సురేష్ మాత్రం మొక్కవోని దీక్షతో కొనసాగిస్తున్నారు. అంతటితో ఆగకుండా అప్పటి నుండి ఏకంగా నాలుగు భాషల్లో అవార్డులు అందిస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక తాజాగా ఓటిటి వారికి కూడా అవార్డులు ఇచ్చే సరికొత్త శకానికి శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆయనకు అన్నింటా మరింత విజయం లభించాలని అలానే అవార్డు గ్రహీతలు అందరికీ తన తరపున అభినందనలు తెలిపారు మురళి మోహన్.

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, నేను 45 ఏళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాను, అప్పటి పరిస్థితులకు నేటి సినిమా పరిస్థితులకు పూర్తి వ్యత్యాసం ఉంది. నేడు సినిమా మన ఇంట్లోకి వచ్చేసింది, ప్రతి ఒక్కరూ చక్కగా ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూసేయొచ్చు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత వచ్చి అంకుల్ ఒక ఓటిటి సినిమా చేస్తున్నాను, అందులో మీరు యాక్ట్ చేయాలని కోరింది. కొంత ఆలోచించిన అనంతరం నటించాను. అదే సేనాపతి, అనంతరం అందరి మెప్పు అందుకున్న సేనాపతి లో నా పాత్రకు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. సంతోషం సురేష్ కి అన్నింటా జయం కలగాలని, ఇటువంటి అవార్డులు అందిస్తున్న అతడికి మరింత విజయం లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అనంతరం మరికొందరు అతిథులు మాట్లాడి ప్రత్యేకంగా సంతోషం సురేష్ కు మరియు అవార్డు గ్రహీతలకు ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియచేసారు. మొత్తంగా ఎంతో వైభవంగా జరిగిన 2022 సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఆహూతులను ఎంతో అలరించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు