సమీక్ష : “సప్త సాగరాలు దాటి – సైడ్ బి” – అక్కడక్కడ ఆకట్టుకునే స్లో లవ్ డ్రామా

సమీక్ష : “సప్త సాగరాలు దాటి – సైడ్ బి” – అక్కడక్కడ ఆకట్టుకునే స్లో లవ్ డ్రామా

Published on Nov 18, 2023 3:04 AM IST
Sapta Sagaralu Dhaati (Side B) Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 17, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర ఆచర్ అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్, పవిత్ర లోకేష్, రమేష్ ఇందిర, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే తదితరులు

దర్శకుడు : హేమంత్ ఎం రావు

నిర్మాతలు: రక్షిత్ శెట్టి

సంగీతం: చరణ్ రాజ్

సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి

ఎడిటర్: వరుణ్ గోలి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో కన్నడ నటుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన రీసెంట్ ఎమోషనల్ హిట్ చిత్రం “సప్త సాగరాలు దాటి సైడ్ బి” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఆల్రెడీ హిట్ అయ్యిన సైడ్ ఏ కి సీక్వెల్ ని కూడా ప్లాన్ చేయగా ఈ సీక్వెల్ ఇప్పుడు సౌత్ భాషల్లో నేడు రిలీజ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే.. మొదటి భాగంలో చేయని నేరాన్ని తనపై వేసుకుని జైలుకి వెళ్లిన మను(రక్షిత్ శెట్టి) తన పదేళ్ల కారాగార శిక్ష నుంచి బయటకి వస్తాడు. అయితే అలా బయటకి వచ్చాక ఓ వేశ్య సురభి(చైత్ర ఆచార్) పరిచయంతో ఓ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు. కానీ తన ప్రేయసి ప్రియా(రుక్మిణి వసంత్) జ్ఞ్యాపకాల నుంచి మాత్రం బయటకి రాలేకపోతాడు. మరి ఈ క్రమంలో మళ్ళీ ఆమె వైవాహిక జీవితంలో సరిగా లేదని తెలుసుకుంటాడు. అక్కడ నుంచి తాను ఏం చేశాడు? తాను ఇన్నేళ్లు జైల్లో ఉండడానికి కారణమైన వ్యక్తుల పట్ల మను ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడు? సురభి పరిస్థితి ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

మొదటి భాగంలో ఒకింత ఎమోషనల్ రైడ్ ని నడిపిన దర్శకుడు ఈ చిత్రంలో దానితో పాటుగా హీరో పెయిన్ తన అగ్రెసివ్ కోణాన్ని కూడా చూపించాడు. దీనితో హీరో పాత్రకి బాగా కనెక్ట్ అయినవారు తనపై సీన్స్ ని ఎంజాయ్ చేస్తారు. అలాగే సైడ్ బి లో సరికొత్త షేడ్ లో అయితే రక్షిత్ శెట్టి చాలా బాగా చేసాడని చెప్పాలి.

తనలోని బాధని తన ప్రేయసి బాగు కోసం తాను పడే తపన ఆ ఎమోషన్స్ ను రక్షిత్ అద్భుతంగా పండించాడు. అలాగే తనతో పాటుగా సినిమాలో ట్రావెల్ అయ్యే సురభి పాత్ర లో కనిపించిన యంగ్ నటి చైత్ర చాలా నీట్ పెర్ఫార్మన్స్ ని కనబరిచింది. ఆన్ స్క్రీన్ రక్షిత్ శెట్టితో అన్ని సీన్స్ చాలా బాగున్నాయి.

వీటితో పాటుగా రుక్మిణి వసంత్ పై సన్నివేశాలు ఒకే అనిపిస్తాయి. ఇంకా సెకండాఫ్ లో నరేషన్ మరికాస్త మెరుగ్గా ఉండగా క్లైమాక్స్ లో ఓ యాక్షన్ పార్ట్ సహా డైరెక్టర్ ఇచ్చిన ఓ క్లీన్ ఎండింగ్ బాగుంది. ఇక వీటితో పాటుగా నటులు రమేష్ ఇందిరా, గోపాల్ తదితర కొందరు ముఖ్య నటులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమా మొదటి భాగాన్ని చూసిన వారు రెండో పార్ట్ కోసం ఎదురు చూసినవారు కాస్త డిజప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాలి. మొదటి సినిమానే ఒకింత స్లో అనుకుంటే ఈ సినిమా దానికన్నా స్లో గా సాగుతుంది. మెయిన్ గా ఫస్టాఫ్ లో మూమెంట్స్ మరింత స్లో గా అనిపిస్తాయి. దీనితో ఈ సాగదీతగా సాగే నరేషన్ తో సినిమాలో కొన్ని మూమెంట్స్ బాగున్నప్పటుకీ ఓవరాల్ కాస్త డల్ గా అనిపిస్తుంది.

ఈ చిత్రంలో హీరోయిన్ రుక్మిణి వసంత్ పాత్ర ఒకింత వీక్ గా అనిపిస్తుంది. ఆమెకి పాత్ర చుట్టూతా డిజైన్ చేసిన కథనం కొన్ని అనవసర సీన్స్ తగ్గించి ఆమె పాత్రలో మరికాస్త డీటెయిల్స్ ఇవ్వాల్సింది. అలాగే ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే అందులో కనిపించే లవ్ మూమెంట్స్ కానీ ఎమోషన్స్ కానీ ఇందులో కాస్త తక్కువే ఉన్నట్టు అనిపిస్తాయి. దీనితో మరీ అంత ఓ హై రేంజ్ ఎమోషనల్ డ్రామా చూసినట్టు అనిపించదు. అలాగే కొన్ని సీన్స్ ఫస్టాఫ్ లో రిపీటెడ్ గా అనిపిస్తాయి.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో కూడా నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా నీట్ గా ఉంది. ఇక టెక్నికల్ టీం లో చరణ్ రాజ్ మ్యూజిక్ బాగుంది. కొన్ని సీన్స్ ని అయితే తన స్కోర్ తో మరింత ఎలివేట్ చేసాడు. అలాగే అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.

ఇక దర్శకుడు హేమంత్ ఎం రావు విషయానికి వస్తే.. తాను ఈ చిత్రానికి పర్వాలేదు అనిపిస్తాడు అని చెప్పొచ్చు. మెయిన్ గా తన నరేషన్ హీరో క్యారెక్టరైజేషన్ లో తాను బాగా డిజైన్ చేసుకున్నాడు. కానీ కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ ఇంకా డెప్త్ గా ప్రెజెంట్ చేయాల్సింది. పైగా తన స్లో నరేషన్ కూడా అంతగా ఇంప్రెస్ చేయదు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “సప్త సాగరాలు దాటి సైడ్ బి”. లో హీరో రక్షిత్ పాత్రలోని స్వచ్ఛత తన పెర్ఫార్మెన్స్ లు సినిమాలో చాలా బాగున్నాయి. అలాగే దర్శకుడు తన పాత్రకు ఇచ్చిన ముగింపు కూడా బాగుంది. కానీ సినిమాలో సాగదీతగా ఉండే నరేషన్ మాత్రం ఈ సాగరాన్ని ఈదేందుకు చాలా సమయాన్ని తీసుకుంటుంది. కొన్ని ఎమోషన్స్ హీరో పాత్ర వరకు అయితే సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఫస్ట్ పార్ట్ తో ఎక్కువ ఊహించి ఈ సినిమా చూస్తే ఒకింత నిరాశపడవచ్చు. ఇది దృష్టిలో పెట్టుకుని ఒక్కసారికి ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు