విజువల్ వండర్ గా ‘శరభ’…కొత్త షెడ్యూల్ ప్రారంభం

విజువల్ వండర్ గా ‘శరభ’…కొత్త షెడ్యూల్ ప్రారంభం

Published on Jun 5, 2016 10:35 AM IST

sarabha
జయప్రదగారు ప్రధాన పాత్రలో ఆకాష్ సహదేవ్ మరియు మిస్తి చక్రవర్తి జంటగా ఎన్.నరసింహారావు దర్శకత్వంలో ఎ.కె.ఎస్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై నిర్మాతలు అశ్వినికుమార్ సహదేవ్ మరియు గిరీష్ కపాడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “శరభ”. శనివారం ఈ సినిమా నూతన షెడ్యూల్ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అశ్విన్ కుమార్ సహదేవ్ మాట్లాడుతూ.. “ఒక సరికొత్త కథాంశంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ తారాగణంతో నిర్మించబడుతున్న మా “శరభ” చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ జూన్ 4 నుండి ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో హై టెక్నికల్ వాల్యూస్ తో, విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమాను రూపొందిస్తున్నాం. బాహుబలి, రోబో తరహాలో భారీ బడ్జెట్ తో ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను అత్యధ్భుతమైన విజువల్గా ఎఫెక్ట్స్ తో చిత్రీకరిస్తున్నాం. ఫైర్ ఫ్లై కంపెనీ వారు ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ ను అందిస్తున్నారు. ఇప్పటి వరకు చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో విన్నూతనంగా సినిమాను రూపొందిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకులను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

జయప్రద, ఆకాష్ సహదేవ్, మిష్టీ చక్రవర్తి, నెపోలియన్, నాజర్, షాయాజీ షిండే, పునీత్ ఇస్సార్, చరణ్ దీప్, ఎల్.బి.శ్రీరాం, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి, రఘుబాబు, జబర్ దస్త్ రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రఫీ: రమణ సాల్వ, సంగీతం: కోటి, ఆర్ట్: కిరణ్ కుమార్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కో ప్రొడ్యూసర్: సురేష్ కపాడియా, నిర్మాత: అశ్వనీ కుమార్ సహదేవ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.నరసింహారావు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు