“కన్నప్ప” లో శరత్ కుమార్ పాత్ర అదే.!

“కన్నప్ప” లో శరత్ కుమార్ పాత్ర అదే.!

Published on Jul 22, 2024 4:07 PM IST

మంచు వారి డైనమిక్ హీరో మంచు విష్ణు హీరోగా చేస్తున్న తన డ్రీం ప్రాజెక్ట్ చిత్రం “కన్నప్ప” కోసం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రిలీజ్ సినిమాగా దీనిని ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు సినిమా శరవేగంగా పూర్తవుతుంది. అయితే రీసెంట్ గా వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా రాగా ఇండియా లోనే భారీ మల్టీస్టారర్ సినిమాగా ఇది రాబోతుంది.

అయితే ఈ చిత్రంలో తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మరి శరత్ కుమార్ పై రీసెంట్ గానే ఓ లుక్ పోస్టర్ కూడా వచ్చి ఆకట్టుకుంది. అయితే ఇపుడు అసలు శరత్ కుమార్ పాత్ర ఏంటి ఎలా కనిపిస్తారు అనేది మరో ఇంట్రెస్టింగ్ లుక్ పోస్టర్ తో రివీల్ చేశారు. ఈ చిత్రంలో శరత్ కుమార్ “నాత నందుడు” గా కనిపించనున్నారు అని రివీల్ చేశారు.

అలాగే తాను పాండవ భీమ సేన, హిడింబిలకి వారసుడు కాగా కోయల ప్రజలకి నాయకుడుగా కనిపిస్తారని ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో మేకర్స్ రివీల్ చేశారు. మరి ఈ రోల్ సినిమాలో ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా మోహన్ బాబు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు