సర్దార్ డైరెక్టర్ కి గిఫ్ట్ గా లగ్జరీ కార్ ఇచ్చిన మేకర్స్!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ స్పై గా నటించిన చిత్రం సర్దార్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మరో మూడు చిత్రాలతో విడుదలై తమిళం, తెలుగు భాషల్లో మంచి హిట్‌గా నిలిచింది. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

కలెక్షన్ల పరంగా చిత్ర యూనిట్ సంతోషం లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మాత లక్ష్మణ్ దర్శకుడికి లగ్జరీ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో హీరో కార్తీ SUV టయోటా కీలను బహుమతిగా ఇస్తున్న దృశ్యంను చూడవచ్చు. భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో కార్తీ ద్విపాత్రాభినయం చేశాడు. ఇందుకు సంబంధించిన రెండో పార్ట్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Exit mobile version