నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ మాస్ డ్రామా “సరిపోదా శనివారం” కోసం ఇప్పుడు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో థియేటర్లు లోకి ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చేసింది. పాన్ ఇండియా భాషల్లో గట్టి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం భారీ బుకింగ్స్ ని తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా నమోదు చేస్తుంది.
అయితే ఈ చిత్రం యూఎస్ మార్కెట్ లో అదరగొడుతుంది అని చెప్పాలి. నాని నిలకడ క్రేజ్ తో సాలిడ్ ప్రీ సేల్స్ బుకింగ్స్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు కేవలం ప్రీ సేల్స్ తోనే హాఫ్ మిలియన్ మార్క్ దగ్గరకు వెళ్ళిపోయింది. అక్కడ ఏకంగా నాలుగు లక్షల 50 వేల డాలర్లు కి పైగా వసూళ్లు సరిపోదా శనివారం తో ఇప్పుడు కొట్టేసింది. ఇది భారీ మొత్తమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి డే1 నుంచి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. మరి ఈ సినిమాకి జేక్స్ బిజొయ్ సంగీతం అందించాడు అలాగే డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
#SaripodhaaSanivaaram has raked in over $450K & Counting in North America premieres gross, with no signs of slowing down! ❤️????
Natural Star Nani’s Rage at the Box Office????#uNANiMassBlockbuster @NameisNani @DVVMovies @PrathyangiraUS @AACreationsUS pic.twitter.com/IrIjQPM9rP
— Prathyangira Cinemas (@PrathyangiraUS) August 29, 2024