న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో నాని యాక్షన్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
‘సరిపోదా శనివారం’ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.68.52 కోట్లు వసూలు చేసినట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ కలెక్షన్స్ రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో నాని తన కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడని అభిమానులు అంటున్నారు.
ఈ సినిమాలో విలక్షణ నటుడు ఎస్.జె.సూర్య నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. అందాల భామ ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా, జేక్స్ బిజాయ్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.