హాయ్ నాన్న యొక్క గ్రాండ్ సక్సెస్ తరువాత, నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తన రాబోయే ప్రాజెక్ట్ సరిపోదా శనివారం చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. దాదాపు 45 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
నాని సినిమాకు ఇప్పటి వరకూ ఇదే హయ్యెస్ట్ డిజిటల్ రైట్స్ మూవీ అని చెప్పాలి. ఈ మూవీలో ఎస్‌జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.