నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా “సరిపోదా శనివారం” కోసం తెలిసిందే. నాని కెరీర్ లో మరో భారీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం థియేటర్స్ లో రెండు వారాలు పాటుగా సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యి అదరగొడుతుంది.
మరి యూఎస్ మార్కెట్ లో అయితే ఎప్పుడో టార్గెట్ కొట్టేసి భారీ లాభలని నాని అందించాడు. ఇక ఇప్ఫడు సరిపోదా శనివారం తెలుగు స్టేట్స్ లో లెక్కలు సరి చేసినట్టు తెలుస్తోంది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో కూడ ఈ సినిమా పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యి బ్రేకీవెన్ కొట్టేసినట్టుగా లేటెస్ట్ టాక్. ఇక ఇక్కడ నుంచి మన దగ్గర కూడా లాభాలే అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే నాని మరోసారి తన మాస్ పవర్ చూపించాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజొయ్ సంగీతం అందించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.