నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో మంచి హోల్డ్ ను కనబరుస్తోంది. ఇప్పటి వరకూ ఈ చిత్రం అక్కడ 2.3 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు రాబట్టింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి.
దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా, ఎస్.జే. సూర్య విలన్ పాత్రలో నటించాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.