నార్త్ అమెరికాలో నాని “సరిపోదా శనివారం” సెన్సేషన్ వసూళ్లు!

నార్త్ అమెరికాలో నాని “సరిపోదా శనివారం” సెన్సేషన్ వసూళ్లు!

Published on Sep 4, 2024 12:21 AM IST


తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాచురల్ స్టార్ నాని. సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. నార్త్ అమెరికాలో ఈ దూకుడు మరింతగా ఉంది. ఈ చిత్రం అక్కడ ఇప్పటి వరకూ 2.1 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు రాబట్టింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి.

నార్త్ అమెరికాలో నానికి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో, ఈ వసూళ్లు నిదర్శనం. సినిమా సినిమాకి వైవిధ్యం కనబరుస్తూ, ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, ఎస్.జే సూర్య కీలక పాత్రల్లో నటించగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు