విడుదల తేదీ : ఆగస్టు 29, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్.జె.సూర్య, సాయికుమార్ తదితరులు
దర్శకుడు: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు : డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: మురళి జి
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్
సంబంధిత లింక్స్: ట్రైలర్
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.
కథ :
సూర్య (నాని)కి చిన్నప్పటి నుండి కోపం ఎక్కువ. అతని కోపాన్ని కంట్రోల్ పెట్టడానికి సూర్య తల్లి ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సూర్య కోపానికి పరిష్కారంగా వారంలో ఆరు రోజులు ప్రశాంతంగా వుంటూ, ఒక్క శనివారం రోజు మాత్రమే కోపాన్ని సూర్య చూపిస్తూ ఉంటాడు. చనిపోయిన తన తల్లికి ఇచ్చిన వాగ్దానం కారణంగా సూర్య కూడా శనివారం ఒక్కరోజు మాత్రమే గొడవలు పడుతూ ఉంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సూర్య, కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్) తో ప్రేమలో పడతాడు. అయితే, ఈ మధ్యలో క్రూరమైన పోలీసు అధికారి దయా (ఎస్‌జే సూర్య) సోకులపాలెం అనే ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను తన అధికార బలంతో పట్టి పీడిస్తుంటాడు. వారిని దారుణంగా కొడుతూ ఉంటాడు. ఆ ప్రజలను కాపాడాలని ఫిక్స్ అయిన సూర్య, దయాను ఏం చేశాడు ?, ఆ ప్రజల్లో సూర్య ధైర్యాన్ని నింపాడా? లేదా ?, అలాగే చారులత తో సూర్య ప్రేమ కథ ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సరిపోదా శనివారం సినిమాలో నాని చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ నాని మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. నాని నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో మరియు తన నేచురల్ లుక్స్ తో నాని సినిమాకే హైలైట్ గా నిలిచాడు. ప్రియాంక అరుల్ మోహన్ తో సాగిన లవ్ స్టోరీలోనూ నాని తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.
హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన
ఎస్.జె.సూర్య కూడా మెప్పించాడు. ఎస్.జె.సూర్య – మురళీశర్మ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. ఇక తండ్రి పాత్రలో నటించిన సాయి కుమార్ కూడా బాగా నటించాడు. మురళీశర్మ, అజయ్ ఘోష్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
దర్శకుడు వివేక్ ఆత్రేయ రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. అలాగే, నాని అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు.
మైనస్ పాయింట్స్ :
నాని పోషించిన సూర్య పాత్రను, ఆ పాత్ర తాలూకు మదర్ సెంటిమెంట్ మరియు కోపాన్ని, ఆ కోపాన్ని చూపించే శనివారాన్ని బాగా డిజైన్ చేసుకున్న వివేక్, కొన్ని చోట్ల అంతే స్థాయిలో ఈ ‘సరిపోదా శనివారం’ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది. అలాగే హీరో -హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి చూపించి ఉంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు వివేక్ ఆత్రేయ కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు
జేక్స్ బిజోయ్ అందించిన పాటలు ఓకే. మురళి జి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాత డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘సరిపోదా శనివారం’ అంటూ వచ్చిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో.. నాని నటన, యాక్షన్ సీన్స్ మరియు మదర్ సెంటిమెంట్, అలాగే నాని పాత్ర తాలూకు ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్ గా సాగాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో నాని నటనతో పాటు పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్, మదర్ సెంటమెంట్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team