యూఎస్‌లో దుమ్ములేపుతున్న ‘సరిపోదా శనివారం’ ప్రీసేల్స్

యూఎస్‌లో దుమ్ములేపుతున్న ‘సరిపోదా శనివారం’ ప్రీసేల్స్

Published on Aug 26, 2024 1:30 PM IST

న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఇప్పిటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. నాని సినిమా అంటే కేవలం తెలుగునాట మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లోనూ మంచి క్రేజ్ ఉంటుంది.

ఇక ‘సరిపోదా శనివారం’ సినిమా కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఈ సినిమా బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రీసేల్స్‌లో ‘సరిపోదా శనివారం’ మూవీ ఇప్పటికే 200K డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. సినిమా రిలీజ్‌కి సమయం ఉండటంతో, ఈ ప్రీసేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్న ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని డివివి.దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు