యూఎస్ ప్రాంతంలో దూసుకు పోతున్న నాని “సరిపోదా శనివారం” ప్రీ సేల్స్!

యూఎస్ ప్రాంతంలో దూసుకు పోతున్న నాని “సరిపోదా శనివారం” ప్రీ సేల్స్!

Published on Aug 18, 2024 9:00 AM IST

టాలీవుడ్ నటుడు, నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం ఈ ఆగస్టు 29 వ తేదీన విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం యొక్క ప్రీ సేల్స్ యూఎస్ ప్రాంతంలో స్టార్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. నాని కెరీర్ లోనే అత్యంత వేగంగా 50కే డాలర్ల వసూళ్లను ప్రీ సేల్స్ రాబట్టింది.

సరిపోదా శనివారం చిత్రానికి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. సినిమా నుండి రిలీజైన ట్రైలర్ అంచనాలను పెంచేసింది అని చెప్పాలి. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు