ప్రస్తుతం మన టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రం “సరిపోదా శనివారం” అనే చెప్పాలి. మాస్ లో మంచి బజ్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో మంచి ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్తుంది.
అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నాని చేసిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. నాని తెలుగు సినిమాలో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ని అందిస్తూ వస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని కంటెంట్ బాగున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కానివి కొన్ని ఉన్నాయి. మరి అలాంటి ఓ రెండు సినిమాల బాకీని ఇపుడు సరిపోదా శనివారం తీర్చేస్తుంది అని నాని చెబుతున్నాడు.
ఆ సినిమాలే తన నుంచి వచ్చిన “గ్యాంగ్ లీడర్” అలాగే “అంటే సుందరానికీ”. ఈ రెండు సినిమాలకి మంచి కంటెంట్ ఉన్నప్పటికీ కమర్షియల్ గా అనుకున్న రేంజ్ సక్సెస్ కాలేదు కానీ ఇప్పుడు మళ్ళీ అదే కంటెంట్ తో చేసిన సరిపోదా శనివారంతో మాత్రం ఆ బాకీ తీర్చేస్తానని నాని ధీమా వ్యక్తం చేసాడు. ఇప్పటికి అయితే ఈ సినిమాపై బజ్ ఆ లెవెల్లోనే ఉంది. మరి ఈ ఆగష్టు 29న సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే.