నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రమే “సరిపోదా శనివారం”. మరి నాని కెరీర్ లో మరో సాలిడ్ మాస్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం తన కెరీర్ లో మరో క్రేజీ ఓపెనింగ్స్ ని అందుకొని అదరగొట్టింది. ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా భారీ వసూళ్లు అందుకుంటుండగా ఇలా రెండు రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు అదిరే లెవెల్లో అందుకుంది.
మరి మేకర్స్ అఫీషియల్ గా అందించిన లెక్క ప్రకారం ఈ చిత్రం రెండు రోజుల్లో 36.03 కోట్ల గ్రాస్ ని అందుకునట్టుగా తెలిపారు. దీనితో నాని కెరీర్ లో మరో అదిరే ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాగా “సరిపోదా శనివారం” నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ వారాంతం కూడా వర్షాలు ఉన్నప్పటికీ మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి. మరి వీకెండ్ కి ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
Name: Surya.
Job: Setting the Box Office on Fire ????#SaripodhaaSanivaaram #BoxOfficeShivaThandavame pic.twitter.com/1pX5n9fFWY— DVV Entertainment (@DVVMovies) August 31, 2024