నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “సరిపోదా శనివారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నాని కెరీర్ లో మరో బిగ్ హిట్ గా నిలిచి 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో శివతాండవమే చూపించగా ఇటీవల ఓటిటి ఆడియెన్స్ ని కూడా పలకరించేందుకు వచ్చింది.
ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా ఇందులో పాన్ ఇండియా భాషల్లో కొన్ని రోజులు కితమే అందుబాటులోకి వచ్చింది. మరి ఇలా వచ్చిన ఈ కొద్ది లోనే ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో సినిమా ట్రెండ్ అవుతుంది. దీనితో ఓటిటిలో కూడా ఈ చిత్రం అదరగొడుతుందనే చెప్పాలి. దీనితో మేకర్స్ ఆలాగే నాని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సాలిడ్ మ్యూజిక్ ని అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే వెర్సటైల్ నటుడు ఎస్ జే సూర్య ఈ సినిమాలో సాలిడ్ విలన్ రోల్ లో నటించారు.
♥️#SaripodhaaSanivaaram @netflix pic.twitter.com/hRmaqULHpI
— Nani (@NameisNani) September 29, 2024