తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ విడుదలకు ఇంకా రెండు రోజులు మాతమ్రే వుంది. ఆల్రెడీ ఈచిత్రం యొక్క ప్రీ బుకింగ్స్ సార్ట్ అయ్యాయి. ఇక ఈచిత్రం తమిళ సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ప్రపంచ వ్యాప్తంగా 3400 స్క్రీన్లలో సందడి చేయనుంది.
ఎఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈచిత్రం మొదటి రోజు రికార్డు వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక్క తమిళనాడులోనే ఈ చిత్రం మొదటి రోజు 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో వైపు ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలవుతున్న ఇంతవరకు అక్కడ ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో ఈ ప్రభావం చిత్ర కలెక్షన్స్ ఫై పడే అవకాశం వుంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 6న విడుదల కానుంది.