ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఫ్యామిలీ డ్రామా మూవీ ‘సత్య’

హమరేశ్, ప్రార్ధనా సందీప్‌ జంటగా నటించిన ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా మూవీ ‘సత్య’. ఈ సినిమాను వాలీ మోహన్‌దాస్‌ డైరెక్ట్ చేయగా శివమ్‌ మీడియా పతాకంపై శివమల్లాల నిర్మించారు. తమిళ చిత్రం ‘రంగోలి’ని తెలుగులోకి ‘సత్య’ పేరుతో అనువదించిన సంగతి తెలిసిందే. ‘ఆడుకాలం’ మురుగదాస్‌ ఈ సినిమాలో తండ్రిపాత్రలో నటించారు.

గవర్నమెంట్‌ కాలెజీ కంటే ప్రైవేట్‌ కాలేజీ అయితే మంచి అలవాట్లు, చదువు వస్తుంది అనే అపోహ నుండి చక్కగా చదివే పిల్లలు ఏ స్కూల్‌లో ఉన్న మంచిగా చదువుతారు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎమోషనల్‌ హిట్‌గా నిలిచింది. అప్పులు చేసి వడ్డీలు కడుతూ పిల్లలను ప్రైవేట్‌ స్కూల్స్, కాలేజీల్లో చేర్చి ఇబ్బందులు పడే ఒక చిన్న ఫ్యామిలీ కథే ఈ ‘సత్య’.

అయితే, తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను ఆహాలో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమాని చూసి ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లోని స్కూల్, కాలెజీ , టీనేజ్‌ లవ్‌ని మరోసారి గుర్తుకు తెచ్చుకంటారని చిత్ర యూనిట్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఈ చిత్రానికి సుందరమూర్తి సంగీతం అందించారు.

Exit mobile version